Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vinare Manujulaara Kreesthu Dilanu

వినరె మనుజులార క్రీస్తుఁ డిలను

Vinare Manujulaara Kreesthu Dilanu

Lyricist: Purushothamu Choudari
Chorus
వినరె మనుజులార క్రీస్తుఁ డిలనుఁ జేయు ఘనములైన పనులలోనఁ
జిత్రమొక్క పని వచించెద‖ వినరె ‖
Verse
మన మనంబు లలరుచుండ దినదినంబు ప్రభుని నిండు ఘన
మహాద్భుతములు వినినఁ దనివిఁ దీరదు‖ వినరె ‖
Verse
ఇలను బేతనియపురంబు గలదు మరియ మార్తలక్క సెలియలందు
వాసముండి రెలమితోడను‖ వినరె ‖
Verse
పరిమళంపు తైలమేసు చరణములకుఁ బూసిన యీ మరియ సోదరుండు
రోగ భరితుఁడయ్యెను‖ వినరె ‖
Verse
వ్యాధిచేత లాజరుండు బాధనొందుచుండఁ గ్రీస్తు నాధుఁ బిలువనంపి
రపుడు నాతు లిరువురు‖ వినరె ‖
Verse
తమ్ము డక్క సెలియలును బ్రి యమ్ము తనకుఁ గలిగియుండ నమ్మహాత్ముఁ
డైన క్రీస్తుఁ డరిగె నచటికి‖ వినరె ‖
Verse
యేసువచ్చు టెఱిగి మార్త యెదురు గానుఁ బోయి తనదు దోసిలొగ్గి
మ్రొక్కి ప్రభువు తోడ బల్కెను‖ వినరె ‖
Verse
కర్త నీకు దేవుఁడిచ్చు ఘనబలమెఱుగుదును సత్య వర్తి విచట లేని
కతన వ్రాలె లాజరు‖ వినరె ‖
Verse
పిదప మరియవచ్చి క్రీస్తు పదయుగమున కొరిగి యేడ్చి మొదట
మార్త పలికినట్లు సుదతి పలికెను‖ వినరె ‖
Verse
అపుడు కర్త వారిపలుకు లాలకించి మదిని మూల్గి కృపకుఁ బాత్రు
రాలితోడ నపుడు నడిచెను‖ వినరె ‖
Verse
నడిచి లాజరుని సమాధి కడకుఁ జేరి గుహను మూయఁ బడిన రాయి
తీయుఁడనుచుఁ ప్రభువు చెప్పెను‖ వినరె ‖
Verse
యేసుతోడ మార్తపలికె నీ సమాధినునిచి నాల్గు వాసరంబులయ్యెఁ
గంపు పట్టి యుండదా‖ వినరె ‖
Verse
దాని నమ్మి చూడుమని మ హానుభావుఁ డాత్మబలము నూని
తండ్రికిపుడు స్తోత్ర మొనరఁజేసెను‖ వినరె ‖
Verse
లాజరు సమాధినెడలి రమ్ము లెమ్మటంచు లోక పూజితుఁడు మహా
రవంబుఁ బూని పల్కెను‖ వినరె ‖
Verse
మరణమైనవాఁడు ప్రాణ భరితుఁడగుచు లేచి వచ్చెఁ తరుణులధిక
హర్షలైరి పెదజనంబుతో‖ వినరె ‖
Verse
కన వినంగ రాని యిట్టి ఘన మహాద్భుతంబుఁ జూచి జనులు క్రీస్తు
యేసునాధు ననుసరించిరి‖ వినరె ‖
Verse
కనుక మనము వానిఁ జేరు కొని సుఖంబుఁ బడయవచ్చు మనసు
నిలిపి యతనియందు మనుట మేలగున్‖ వినరె ‖

Related Tags

ResurrectionMiracles