Chorus
వినరే నరులారా మనముల వేడుకలను మీర మన, రక్షకుఁడగు
మరియా తనయుని మహిమలు చెవులార‖ వినరే ‖
Verse
తన కన్నను ముందు యోహా నను నతఁ డింపొందు ఘనతర
మగును ప్రవచనముఁబ ల్కెను భూజను లందు‖ వినరే ‖
Verse
అతఁడు యోర్దాను నదిలో ఖ్యాతిగ ననుదినమున్ పాతకులకు
బా ప్తిస్మ మిచ్చు నెడం ప్రభు వచ్చటి కరిగెన్‖ వినరే ‖
Verse
న్యాయము నిలుపుటకై ప్రభుని వి ధేయతఁ గనుపఱచి శ్రేయ పతి
బొం దెను యోహానుని చేత బాప్తిస్మంబు‖ వినరే ‖
Verse
పరమండల మపుడు తెరవం బడి పావురము గతిన్ పరిశుద్ధాత్మ శు
భప్రభ లీనుచుఁ ప్రభువు మీఁద వ్రాలెన్‖ వినరే ‖
Verse
ఆకాశమునుండి కలిగెను ప్రాకటమగు రవము నా కితఁడు ప్రియం
బౌ కుమారుఁడా నంద మొంది రనుచు‖ వినరే ‖
Verse
అంతట మన కర్త పరిశుద్ధాత్మ బలము కలిమిన్ సంతసమున మో
క్ష కుశలవార్తను జాటంగను దొడఁగెన్‖ వినరే ‖
Verse
ఆ నిత్య సువార్త మన మెద లో నిడి నమ్మినచో నానందమయం
బమృత మేసు ద యా నిధి మన కొసంగున్‖ వినరే ‖