Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vinare Yaposthalula Karyamul Krai

వినరే యపోస్తలుల కార్యముల్ క్రై

Vinare Yaposthalula Karyamul Krai

Lyricist: Purushothamu Choudari
Chorus
వినరే యపోస్తలుల కార్యముల్ క్రైస్తవు లను వారి కవి యెంతో ధైర్యముల్
మనసు లొక్కటిఁ జేసి కొని యట్లు ప్రార్థింప ఘన ముగ విమలాత్మ
చనుదెంచె వారిపై‖ వినరే ‖
Verse
పరమండలమునుండి వచ్చెను పెద్ద కరువలివలె శబ్ద మిచ్చెను తిర
ముగ వార లం దరుఁ గూడి యున్న మం దిర మెల్ల నిండె బం ధురమై
తన్నాదము‖ వినరే ‖
Verse
అనలార్చులను దీప్తి మించుచు బీఁట లగు జిహ్వల్వలె గనుపించుచు
ఘనముగ నొక్కొక్క జనునిపై నవి నిల్వఁ గను బరిశుద్ధాత్మచే తను
నింపఁబడి రంత‖ వినరే ‖
Verse
వారన్య భాషలతోడను నాత్మ ప్రేరణమును జేయు జాడను ధారా
ళముగ భాషాం తరము లాడిరి విన్న వారి కబ్బురమై వి చారము ల్బొడమంగ‖ వినరే ‖
Verse
ముందట వారిటుల గుంపుగ మోద మందుచు దేవునిఁ గొల్చి తా
మందరు చూడఁగ వింత వింత పనుల నందందు జేసిరి దేవుని
దయచేత‖ వినరే ‖
Verse
మనము నా రీతిగ గుంపుగాఁ గూడి మన దేవుఁ గొల్వఁగ భూమిలో
మనుజుల కాశ్చర్య మగు కార్యములఁ జేయ నొనగూడు మనసు
కా నందమును గల్గు‖ వినరే ‖

Related Tags

Holy SpiritApostlesPentecost