Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vinare Yesukreesthu Bodha Madini Ga

వినరే యేసుక్రీస్తు బోధ మదిని గ

Vinare Yesukreesthu Bodha Madini Ga

Lyricist: Pulipaka Jagannadhamu
Verse
వినరే యేసుక్రీస్తు బోధ మదిని గొనరే యాతని సత్య బోధ వినిన
యేసుని బోధ విశ్వాసమున మీరు గొనయెదరు నిజముగ గొప్ప
భాగ్యంబులు‖ వినరే ‖
Verse
దారి దొలఁగియున్న వారినెల్లను బ్రోవఁ గోరివచ్చితి నంచు కూర్మి
యేసువు తెల్పె‖ వినరే ‖
Verse
మన పాపముల నెల్ల మన కొరకు వహియించి మన యందు దయచేతఁ
దన ప్రాణమర్పించి‖ వినరే ‖
Verse
మారు మనసు నొంది మరల రమ్మంచువే మారు బిలుచు యేసు
మైత్రిని దలఁచుచు‖ వినరే ‖
Verse
తన యాజ్ఞ గైకొని తన సేవజేసెడి మనుజుల కొసఁగును మనసున
నెమ్మది‖ వినరే ‖
Verse
తాను నడచిన త్రోవ తన జనులు ద్రొక్కును తానెపుడు చేయును
తగిన సహాయ్యంబు‖ వినరే ‖

Related Tags

GospelSalvationTeaching