Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vinare Yo Narulaara

వినరే యో నరులారా

Vinare Yo Narulaara

Verse
వినరే యో నరులారా – వీనుల కింపు మీర
మనల రక్షింప క్రీస్తు – మానుజావతారుడయ్యె – వినరే
అనుదినమును దే-వుని తనయుని పద
వనజంబులు మన-మున నిడికొనుచును‖ వినరే ‖
Verse
నర రూపు బూని ఘోర – నరకుల రారమ్మని
దురితము బాపు దొడ్డ – దొరయౌ మరియా వరపుత్రుడు
కర మరు దగు క-ల్వరి గిరి దరి కరి
గి రయంబున ప్రభు – కరుణను గనరే‖ వినరే ‖
Verse
ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్ష
బూని తన మేని సిలువ – మ్రాను నణచి మృతి బొందెను
దీన దయా పరు-డైన మహాత్ముడు
జానుగ యాగము – సలిపిన తెరంగిది‖ వినరే ‖
Verse
ఇల మాయావాదుల మాని – యితడే సద్గురు డని
తలపోసి చూచి మతి ని-శ్చల భక్తిని గొలిచిన వారికి
నిల జనులకు గలు-ములనలరెడు ధని
కుల కందని సుఖ-ములు మరి యొసఁగును‖ వినరే ‖
Verse
దురితము లణప వచ్చి – మరణమై తిరిగి లేచి
నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగ జనె
బిరబిర మన మం-దర మా కరుణా
శరనిధి చరణ మె – శరణని పోదము‖ వినరే ‖

Related Tags

WorshipChristmas