Chorus
వినరే యో నరులారా వీనుల కింపు మీర మనల అక్షింప క్రీస్తు
మనుజావతారుఁ డయ్యొ వినరే అనుదినమును దే వుని తనయుని పద
వనజంబులు మన మున నిడికొనుచును‖ వినరే ‖
Verse
నరరూపుఁ బూని ఘోర నరకుల రారమ్మని దురితముఁ బాపు దొడ్డ
దొరయో మరియా వరపుత్రుఁడు కర మరు దగు క ల్వరి గిరి దరి కరి
గి రయంబున ప్రభు కరుణను గనరే‖ వినరే ‖
Verse
ఆనందమైన మోక్ష మందరి కియ్య దీక్ష బూని తనమేని సిలువ
మ్రాను నణఁచి మృతిఁ బొందెను దీన దయా పరుఁ డైన మహాత్ముఁడు
జానుగ యాగము సలిపిన తెరంగిది‖ వినరే ‖
Verse
పొందుఁగోరిన వారి విందా పరమోపకారి యెంద రెందరిఁ బరమా
నందపద మొందఁగఁ జేసెను అందమునన్ దన బొంది సురక్తము
జిందెను భక్తుల డెందము గుందఁగ‖ వినరే ‖
Verse
ఇల మాయావాదుల మాని యితఁడే సద్గురు డని తలపోసి చూచి
మతి ని శ్చల భక్తిని గొలిచిన వారికి నిల జనులకు గలు ములనలరెడు
ధని కుల కందని సుఖ ములు మరి యొసఁగును‖ వినరే ‖
Verse
దురితము లణఁప వచ్చి మరణమై తిరిగి లేచి నిరత మోక్షానంద
సుం దర మందిరమున కరుదుగఁ జనె బిరబిర మన మం దర మా
కరుణా శరనిధి చరణ మె శరణని పోదము‖ వినరే ‖