Verse
వినతి వినతి వినతి త్రియేకునికి
Verse
మనసునందు సద్గతి నిడును
Verse
కోపదినమును తప్పించుకొనుటకు - ఏ పని చేసితివి
బాధలు నిన్ను చేరక యుండును - నాథుని కనుగొనిన
Verse
ఇచ్ఛల నెల్లను ఇలలో విడచి - నెచ్చెలు డేసును నమ్ము
మేదినిసకలము మాయమైపోవును - సదయుడేసు నిలచున్
Verse
కాయమస్థిరము కాలము నిల్వదు మాయక్షితి మాయమగున్
దాసుడాకాలము వ్యర్థము చేయక - యేసునంగీకరింపుము
Verse
రక్షకుడేసును సిలువలో గనుము - రక్షింప బడియెదవు
జీవము సత్యము మార్గము చూతువు - దైవసుతునియందు
Verse
రక్షకు డాశ్రయదుర్గము వైద్యుడు - రక్షణ శృంగము కోట
మింటను దేవుడు బండయు కేడెము - జుంటితేనెయు నాయనే
Verse
మంచికాపరి నిరతము కాచు - నంచితముగ నడుపున్
జయము నిచ్చున్ త్రోసివేయక - ప్రియముతో పరుగిడరా
Verse
హల్లెలూయ పాట నార్భాటముతో - నెల్లరకు చాటుము
త్వరగా రాజువచ్చును భువికి - దుష్టుల నణచుటకై