Verse
వినవా మనవి యేసయ్యా
ప్రభువా శరణం నీవయ్యా
మలినము నా గతం – పగిలెను జీవితం
చేసుకో నీ వశం‖ వినవా ‖
Verse
లోక స్నేహమే కోరి దూరమైతిని
వీడిపోయి నీ దారి ఓడిపోతిని
విరిగిన మనసుతో నిన్ను చేరాను
చితికిన బ్రతుకులో బాగు కోరాను
నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా
నా తండ్రి నీవేనయ్యా‖ వినవా ‖
Verse
ఆశ ఏది కానరాక బేలనైతిని
బాధలింక పడలేక సోలిపోతిని
అలసిన కనులతో నిన్ను చూసాను
చెదరిన కలలతో కృంగిపోయాను
నన్ను సేదదీర్చి సంతోషించని యేసయ్యా
నా దైవము నీవయ్యా‖ వినవా ‖