Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vinave Naa Vinathi Nivedhana Daya Velayanga

వినవే నా వినతి నివేదన దయ వెలయఁ

Vinave Naa Vinathi Nivedhana Daya Velayanga

Lyricist: Mikkili Samuel
Chorus
వినవే నా వినతి నివేదన దయ వెలయఁగ నో ప్రభువా నిను శరణొందితి
ననుఁ గుశలంబున నునుపవె యో ప్రభువా‖ వినవే ‖
Verse
నిర్మల గతి సంధ్యా కాలంబున నీ స్తవమగు ప్రభువా ధర్మదీప్తి నా
కొసఁగి చేయు దీప్తవంతునిగ నన్ను‖ వినవే ‖
Verse
నీ మహదాశ్రయ మొసఁగి దుర్గతిని నేఁబడకుండఁగను నా మది
తన్వాది సమస్తముతో ననుఁ గావవె ప్రభువా‖ వినవే ‖
Verse
ఎన్ని దినంబులు జగతి నున్న నీ కన్న వేరే గలవా పన్నుగ మది
నీ పద సంగతమై యున్నది రేవగలు‖ వినవే ‖
Verse
పాప కరుండను నే సుకృతా పాది కర్మ మెఱుఁగ నీ పాద సరోజము
నా కొసఁగుము నాపై నీ కృపఁ జెలఁగ‖ వినవే ‖
Verse
నీ కొరకై నా మనము దృఢంబౌఁ గాక యేసు ప్రభువా నాకుఁ
బిశాచముచే భ్రమ జన్మము గాకుండఁగ నేలు‖ వినవే ‖

Related Tags

Prayer