Chorus
విందు పరమందుఁబెండ్లి విందు పరమందుఁ బొందు జనుల డెందములా
నందము నొందు‖ విందు ‖
Verse
సత్య సంధుఁ డైన యేసు సామికి సభకు నిత్య ప్రధానము యెహోవా
నిర్ణయించెను రండు‖ విందు ‖
Verse
నీతి కనికరములతోడ నినుఁ బ్రధానము ప్రీతిగా నొనరించితినని పిలచె
సత్యము రండు‖ విందు ‖
Verse
ఎన్నఁడు విడనాఁడను నే నెంత మాత్రము నిన్నెడఁబాయ నను మాట
నిజము దత్తము రండు‖ విందు ‖
Verse
పరమ నగరు ద్వారములు తెరువఁబడినవి గురుతరమణి తోరణమును
గూర్పఁబడినవి రండు‖ విందు ‖
Verse
నిత్యజీవ పదార్ధములు నిండి యున్నవి సత్యమచట మనము చేర
సర్వము మనవి రండు‖ విందు ‖
Verse
దూత లంత యేసు ప్రభుని బ్రీతిఁ జేయను నూతన సంగీతములను
జేతురు వినను రండు‖ విందు ‖