Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vinnaaraa Vinnaaraa Shubhavaartha Shubhvaartha

విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త

Vinnaaraa Vinnaaraa Shubhavaartha Shubhvaartha

Lyricist: G Davidson
Verse
విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త
మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను
వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను
తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను‖ 2x ‖
ఊరు వాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాం
యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం‖ 2x విన్నారా ‖
Verse
దూతలు చెప్పారంటా రక్షకుడు పుట్టాడని
గొల్లలు వచ్చిరంటా బాలుని చూచిరంటా‖ 2x ‖
పరలోక దూతల సమూహముతో – స్తోత్రగీతాలు పాడిరంటా
లోక రక్షకుడు మెస్సయ్యేనని ఆనందముతో వెళ్లిరంటా‖ ఊరు వాడా ‖
Verse
ఆ….తారొకటి చెప్పేనంటా రారాజు పుట్టాడని
జ్ఞానులు వచ్చిరంటా బాలుని చూచిరంటా‖ 2x ‖
బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా ఇచ్చి వచ్చిరంటా
రాజులకు రాజేసయ్యేనని సంతోషముగా వెళ్లిరంటా‖ ఊరు వాడా ‖

Related Tags

GospelChristmasCelebration