Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vinthagala Maa Yesu Premanu Santhasamuna

వింతగల మా యేసు ప్రేమను సంతసమున

Vinthagala Maa Yesu Premanu Santhasamuna

Lyricist: Thupili Benjamin
Verse
వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును పంతముగఁ
దన ప్రాణమును పా పులకు నియ్యను వచ్చి సిలువను జచ్చి నను రక్షించె
నహహా‖ వింత ‖
Verse
ప్రీతిగల మా ప్రభుని కృప బహు ప్రియముతోఁ జాటింతును సాధుగా
నాకొఱకు సిలువను చాల శ్రమల భరించి చావు జ యించి నను రక్షించె
నహహా‖ వింత ‖
Verse
పాడుఁడీ మా యేసు ప్రేమను వేఁడుఁడీ మదిఁ గూడుఁడీ పాడుఁడీ
తన దివ్యరక్తము పాప క్రయముగ నిచ్చి శాపముఁ బాపి నను రక్షించె
నహహా‖ వింత ‖
Verse
నిత్య జీవము నిండు నెమ్మది నిరతముగ నాకియ్యను రక్తస్వేదము
గార్చె నహహా నరక శాపముఁ ద్రుంచి యాపద నుంచి నను రక్షించె
నహహా‖ వింత ‖

Related Tags

PraiseSalvationJesus Love