Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vintimayya Nee Swaramu Kantimayya Nee Roopamunu

వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును

Vintimayya Nee Swaramu Kantimayya Nee Roopamunu

Chorus
వింటిమయ్యా నీ స్వరము - కంటిమయ్యా నీ రూపమును
ప్రియప్రభూ నిన్నుగాక వేరెవరిని చూడము వినము
Verse
భక్తి మర్మము గొప్పది యెంతో
శరీరుడుగా మారిన దేవా, దూతలకు కనబడితివి
లోకమందు నమ్మబడియున్న దేవా
Verse
భయపడవలదని దూతలు తెల్పె
మహా సంతోషకరమైన వార్త, రక్షకుడు పుట్టెనని
పరమందు మహిమ భువికి శాంతియనిరి
Verse
నరరూప ధారివి యైతివి ప్రభువా
అద్భుతములు చేసియున్నవు, వేరెవ్వరు చేయలేరు
అద్భుతకరుడ ఘనత కలుగును గాక
Verse
మూగవారికి మాటలిచ్చితివి
గ్రుడ్డి కుంటిని బాగు జేసితివి, మృతులను లేపితివి
పరాక్రమ శాలివి నీవే ఓ ప్రభువా
Verse
ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి
అధికారముతో తిరిగి లేచితివి, మరణపు ముల్లు విరచితివి
నమాధి నిన్ను గెలువక పోయెను
Verse
ఇహము నుండి పరమున కేగి
మా కొరకై నీవు రానై యున్నావు, ఆనందముతో కనిపెట్టెదము
మదియందె నిరీక్షణ కలిగి స్తుతింతుం

Related Tags

PraiseWorshipChristmas