Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vinudi Soadharulaaraa Naa Yaesu Prabhu Yila Kaethemchen

వినుడి సోదరులారా నా యేసు ప్రభు యిల కేతెంచెన్

Vinudi Soadharulaaraa Naa Yaesu Prabhu Yila Kaethemchen

Chorus
వినుడి సోదరులారా - నా యేసు ప్రభు - యిల కేతెంచెన్
Verse
ఇలకేతెంచెన్ - ముక్తిని దెచ్చెన్
పాపుల విడిపించెన్ - విడిపించ నేసు యిలకేతెంచెన్
Verse
స్వర్గీయ తండ్రికి - ఏక కుమారుడు
మనుష్య పుత్రుండాయెన్ - పుత్రుండుగా యిలకేతెంచెన్
Verse
గ్రుడ్డికి కన్నులు - మూగకి మాటలు
చెవిటికి చెవుల నిచ్చెన్ - యిచ్చుటకేసు యిలకేతెంచెన్
Verse
కుష్టు రోగుల - శుద్ధులజేసెను
చచ్చినవారిని లేపెన్ - లేపుటకేసు యిలకేతెంచెన్
Verse
పాపములో నీవు - పడియుండగా
పవిత్ర ప్రేమను జూపెన్ - జూపించనేసు యిలకేతెంచెన్
Verse
పాపిల కొరకై - సిలువను మోసెన్
రక్తము చిందించెన్ - చిందించ నేసు యిలకేతెంచెన్
Verse
యేసు నామమున - విశ్వాసముంచుము
నిశ్చయముగ రక్షించున్ - రక్షించనేసు యిలకేతెంచెన్
Verse
మహిమ ఘనత - మాయేసు ప్రభునకే
మమ్ముల తండ్రితో జేర్చెన్ - జేర్చుటకేసు యిలకేతెంచెన్

Related Tags

GospelSalvationJesus