Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vinumaa Yesuni Jananamu

వినుమా యేసుని జననము

Vinumaa Yesuni Jananamu

Verse
వినుమా యేసుని జననము
కనుమా కన్య గర్భమందున‖ 2x ‖
పరమ దేవుని లేఖనము‖ 2x ‖
నెరవేరే గైకొనుమా‖ 2x ‖
ఆనందం విరసిల్లె జనమంతా
సంతోషం కలిగెను మనకంతా
సౌభాగ్యం ప్రణవిల్లె ప్రభుచెంత
చిరజీవం దిగివచ్చె భువికంతా‖ వినుమా ‖
Verse
గొల్లలొచ్చె దూతద్వారా సాగిలపడి మ్రొక్కిరంట
చుక్కచూచి జ్ఞానులువచ్చిరి యేసును చూచి కానుకలిచ్చిరి
మనకోసం పుట్టెనంట పశువుల పాకలోన
ఎంత మస్తు దేవుడన్న రక్షణనే తెచ్చెనన్నా‖ వినుమా ‖
Verse
పాపులనంతా రక్షింపగా
పరమును విడిచె యేసు‖ 2x ‖
దీనులకంతా శుభవార్తేగా‖ 2x ‖
నడువంగ ప్రభువైపునకు‖ 2x ఆనందం ‖
Verse
అదిగో సర్వలోక రక్షకుడు
దివినుండి దిగివచ్చినాఁడురా‖ 2x ‖
చూడుము యేసుని దివ్యమోమును‖ 2x ‖
రుచియించు ప్రభుని ప్రేమను‖ 2x ఆనందం ‖

Related Tags

WorshipChristmasNativity