Verse
విరిగిన మనస్సుతో నలిగిన హృదయముతో
అర్పణగా నీ సన్నిధిలో చేరితి
గైకొనుమా నా ప్రాణనాధుడా
Verse
బలులను కోరవు బలియైన వాడవు
భరించినావు నా పాపాల భారము
ధరయందెవ్వరు చేయ్యనిదే త్యాగము
సరిరాదు ఇలయేది నీదు ప్రేమకు
Verse
సజీవయాగమై సర్వాంగహోమమై
క్రీస్తు శరీరమై పరిశుద్ధ సంఘమై
పానార్పణముగా నే పోయబడుదును
ప్రకటింతు ప్రతిచోట నీ సువార్తను