Chorus
విరిసిన హృదయాలకు కలిసెను బంధం
కనుసైగలు చేయుచు ముచ్చటించెను‖ 2x ‖
తీయని భాసలే కమ్మని ఊసులే
బంధువుల రాక స్నేహితుల యేర మనసు మురిపించెనే‖ విరిసిన ‖
Verse
ఆశకే లేవు హద్దులు మనిషైనా ప్రతివానికి
అవి కలతలా బాధ రేపెను మరు క్షణము నీ బ్రతుకులో‖ 2x ‖
ఉన్నదంత చాలని – ప్రభువు మనకు తొడని‖ 2x ‖
మరువకుమా ప్రియ మరువకుమా‖ విరిసిన ‖
Verse
మనసులో దాగే తపనకు ప్రతిరూపమే ఈ దినం
ఎదురు చూసే పరువానికి ప్రతిరూపమే ఈ దినం‖ 2x ‖
ఏక మనస్సుతోనే – చక్కనైన జీవితం‖ 2x ‖
మరువకుమా ప్రియ మరువకుమా‖ విరిసిన ‖