Verse
విశ్వాకాశము లాదులను
సృష్టించిన విభుఁ డగు పరమ
ఈశుఁడు సర్వశక్తుఁ డగు
భాసుర తండ్రిన నమ్ముదును
నమ్ముదును నే నమ్ముదును
Verse
పరిశుద్ధాత్ముని మూలమున
మరియ కన్యకా గర్భమున
ధరియింప బడి పుట్టిన శ్రీ
గురు ప్రభుయేసును నమ్ముదును
నమ్ముదును నే నమ్ముదును
Verse
పొంతి పిలాతుని కాలమున
నెంతో శ్రమపడి సిల్వఁబడి
వింతగ యధోతుల మందెనని
నమ్ముదును నే నమ్ముదును
Verse
మూఁడవనాఁడు మృతి నుండి
వడిగాఁ బునరుత్థానుండై
చూడఁగ బరమున కేతెంచె
నాధుని కుడియెఁడ గూర్చుండెన్
నమ్ముదును నే నమ్ముదును
Verse
అక్కడ నుండి యిహమునకుఁ
గ్రక్కున వచ్చి సజీవులకు
నిక్కము న్యాయముమృతులకును
జక్కగఁ దీర్చెడు నని మదిని
నమ్ముదును నే నమ్ముదును
Verse
పరిశుద్ధాత్ముని నమ్ముదును
నమ్ముదును నే నమ్ముదును
పరిశుద్ధాత్ముని నమ్ముదును
నమ్ముదును నే నమ్ముదును
Verse
పరిశుద్ధ పరచంబడిన
సర్వసాధారణ సంఘం
పరిశుద్ధుల యన్యోన్య మగు
పరిశుద్ధ స్నేహము కల వంచు
నమ్ముదును నే నమ్ముదును
Verse
మహికర్మ పరిహారమును
దేహ పునరుత్థానము
బహుళము నిత్య జీవమును
మహిమ యనంతమై వెలయు నని
నమ్ముదును నే నమ్ముదును‖ ఆమెన్ ‖