Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vishvaasa Phlithamulu Vishadhammuga Nee

విశ్వాస ఫలితములు విశదమ్ముగా నీ

Vishvaasa Phlithamulu Vishadhammuga Nee

Lyricist: Murari David
Verse
విశ్వాస ఫలితములు విశదమ్ముగా నీకు వివరింతు విను క్రైస్తవా విశ్వాస
వంతునికి విశ్వమ్ములోపల మ వశ్యమ్మొదవు క్రైస్తవా‖ విశ్వా ‖
Verse
ఫలములన్నిటిలోన ప్రాముఖ్యమైనట్టి ఫలమది పాప క్షమమే విలువైన
యీ ఫలము గలుగు నరునికి ముక్తి దొలగ దతనికి క్షేమమే‖ విశ్వా ‖
Verse
దానములలోన ప్రధానమనబడు సమా ధానమును గల్గించును మాని
తమ్ముగ సమా ధానమును భువిదివుల మహితుతో గల్గించును‖ విశ్వా ‖
Verse
నరక పాత్రులమైన నావంటి నీవంటి దురిత జీవుల కెల్లను
గొఱతలన్నియు దీర్చ నిరత జీవము నియ్య నిశ్చయమ్మిది చెల్లును‖ విశ్వా ‖
Verse
ముత్తెమ్మునకు వలెనె మురికి గప్పఁగబడిన చిత్తమును చిత్రవిధిగా
రత్నమువలె మిగుల రంజిల్లఁ జేసెడి ప విత్రాత్మ మనకొదవుగా‖ విశ్వా ‖
Verse
మేరలేని దోష కారులమై ప్రభుకు దూరముగఁ దొలగియున్న వారమగు
నను నిన్ను చేరంగ బిలిచి కు మారత్వమొసంగు నన్న‖ విశ్వా ‖
Verse
సేగు క్రియలను జేసి పోగొట్టుకొన్నట్టి క్షేమ రాజ్యపు హక్కులన్
బాగుగ మనకిచ్చి బాంధవ్య మొనరించు భగవంతునికి మనకున్‖ విశ్వా ‖
Verse
విశ్వనాధుని గొప్ప విశ్రాంతిలోను ప్ర వేశము నాకు నొసంగుగా
విశ్వాస ఫలము లివి నీ శాశ్వత రక్ష ణాశ్రయం బిదియె విడకు‖ విశ్వా ‖

Related Tags

FaithSalvationChristian Life