Chorus
విశ్వాస సహితముగను - ప్రకటించుడి యేసుని
Verse
నిత్యజీవము చేపట్టి - సత్యవేదము చేబూని‖ 2x ‖
పవిత్ర హృదయములతో - పోరాడుడి విజయముతో‖ 2x ‖
Verse
నీతిని భక్తిని గోరి - నిజమైన విశ్వాసులుగా
ఓర్పును ప్రేమనుగల్గి - పోరాడుడి విజయముతో‖ 2x ‖
Verse
ఆకాశమున నుండి - కలిగిన దర్శనమునకు
అవిధేయత చూపకను - పోరాడుడి విజయముతో‖ 2x ‖
Verse
క్రీస్తేసు మనసు కలిగి - సత్క్రియలను జరిగించి
యోధులుగా నిలుచుండి - పోరాడుడి విజయముతో‖ 2x ‖
Verse
దీన మనసు కలిగి - ప్రియులారా లోబడియు
మహిమ కిరీటముకై - పోరాడుడి విజయముతో‖ 2x ‖
Verse
ఆత్మల రక్షణకొరకై - అర్పించుడి జీవితము
అంతమువరకు నిలిచి - పోరాడుడి విజయముతో‖ 2x ‖
Verse
యేసుని జీవము కలిగి - ఇలలో శ్రమనోర్చుచు
విజయోత్సాహముతోడ - హల్లెలూయ పాడెదము