Chorus
విశ్వాసమే విజయము విను ప్రియుఁడా య విశ్వాస మపజయము
విశ్వాసాయుతమైన విసుకని సుకార్యములే విశ్వాసవంతునికి విజయ
మొసంగును నిజము‖ విశ్వాసమే ‖
Verse
భక్తుఁ డందు వలననే బ్రతుకును మరియు శక్తినొంది నిల్చును
యుక్తముగ వర్తించి యుర్విని జయించి ముక్తినొందున టంచు రక్తిగాఁ
పాడుదును‖ విశ్వాసమే ‖
Verse
మంచి పేరు నొందును సాతాను నెది రించి విజయ మొందును
మించిన బాధ ల్స హించి జయించును నంచిత మరణము నానంద
ముగఁగాంచు‖ విశ్వాసమే ‖
Verse
ప్రవిమల మొందెదము పాపమునుండి పరిహరింపఁబడుదుము
అవి రతమును మనము నాశ్చర్యముగ ఘనము భువియందున్ దివియందున్
బుధులతో నొందుదుము‖ విశ్వాసమే ‖
Verse
నీతిమంతుల మౌదుము నిశ్చయము ప్ర ఖ్యాతి బోధను నేర్తుము ఆ
తండ్రి దత్తముల నన్ని యార్జించుచు యాతని సుభద్రములో ననయ
ముందుము నిజము‖ విశ్వాసమే ‖
Verse
పరిపూర్ణ విశ్వాసమే క్రియలతో నున్న మరి మంచి విశ్వాసమే
ధరయందున్ బరమందున్ ధన్యాత్మునిగఁ జేయున్ సరగు నద్దానినే
సంపాదించుము ప్రియుఁడా‖ విశ్వాసమే ‖