Verse
విశ్వాసముతో వేఁడెడి వారికి విశ్వ మంతయును వీల్పడును
శాశ్వత రాజ్య థీశ్వరుఁ డాఢ్యుఁడు శాశ్వత మగు నీ శాసన మె చ్చెను‖ విశ్వా ‖
Verse
బిడ్డలు తండ్రుల వేడఁగ నన్నము బెడ్డ లిచ్చు వె ఱ్ఱులు గలరే దొడ్డ
తండ్రి నిలఁ దోడ్పా టడిగిన నడ్డులేక విమ లాత్మ నొసంగును‖ విశ్వా ‖
Verse
నమ్మకమునఁ జెడు నరులను గానము నమ్మక చెడుదురు నరులయ్యో
ఇమ్మహి సకల శు భమ్ములు గలుగును సమ్మతి వెతకఁగ శాశ్వత రాజ్యము‖ విశ్వా ‖
Verse
వెతకెడు వారికి వెసఁ గృపఁ జూపును గతిఁ గని వేడం గాఁ దెర
చున్ సతతము యేసుని చక్కని పేరట హిత మతి వేఁడగ నెంత యు
మేలగు‖ విశ్వా ‖
Verse
బల మేమియుఁ గనఁ బడ దాహ నే సలిపెడు భక్తిని సతి మను చు
నలయకు నేలను నావగింజ మరి నిలిపినఁ జెట్టయి నింగికి నెదుగదె‖ విశ్వా ‖
Verse
అవిశ్వాసమున నతి భీతులచే నవిసి క్రుంగ నగు నే మనసా
భువిఁ బాపాత్ములఁ బ్రోచెడు ప్రభు కృపఁ జవిఁ జూడుము నుతి
సల్పుచు వేగమే‖ విశ్వా ‖