Chorus
విసుగకుండా నిత్యము - ప్రార్థించ వలెనని
విశదముగా నుడివితివి - విసుగకుండా నిత్యము
Verse
ఏకీభవించి భువిపైన యిద్దరు - వేడుకొను సంగతులను గూర్చి
నా తండ్రివలన దొరుకునని - నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా
Verse
ఆది అపొస్తలుల యేక భావముగా - ఎడతెగక నిను ప్రార్థించగా
వారి మొఱ నాలించిన ప్రభువా - మా మొఱ నీ చెంతకు రానిమ్ము
Verse
పేతురపొస్తలుడు చెరసాలలో నుండ - అత్యాసక్తిగా ప్రార్థించగా
ఆనాటి శిష్యులు కనిరి - నీ గొప్ప మహాత్మ్యమును
Verse
నా యందు మీరు మీలో నావాక్యము - నిలిచియుండిన యెడల మీకు
ఏది ఇష్టమో దాని నడిగి - పొందుమంటివి క్రీస్తు ప్రభువా
Verse
ఇద్దరు ముగ్గురు నా నామమున యెక్కడ - విసుగక కూడియుందురో
అందరి మధ్యనుండే ప్రభువా - రమ్ము మా మధ్యకు నేడే