Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Visukade Praanambu Vijnaani Kilana

విసుకదే ప్రాణంబు విజ్ఞాని కిలన

Visukade Praanambu Vijnaani Kilana

Lyricist: Purushothamu Choudari
Verse
విసుకదే ప్రాణంబు విజ్ఞాని కిలను పొసగు వైరాగ్యంబు పుట్టదే
తలను అసదు గానట్టి కష్టానుభవమే గాని యసదృశానంద ఫల
మొసగుఁ నది యేది‖ విసుకదే ‖
Verse
మును పేది యుండెనో వెనుక నదియే యుండు మునుపు వెనుకకు
మధ్య మున నున్న దదియే నొనరంగఁ గ్రొత్తయై యుత్పన్నమగు నట్టి
ఘనకార్య మొక్కటియుఁ గానంగరాదు‖ విసుకదే ‖
Verse
ధరణి మీఁదికి దిగం బరుఁబగుచు నేతించు మరణ మప్పుడు దిగం
బరుఁడగుచుఁ బోవున్ నర్రుడు పుట్టినఁడు సరెకెద్దియును తేఁడు
మరణమగు నాఁడొక్క సరకుగొనిపోఁడు‖ విసుకదే ‖
Verse
ఒక తరము పోవు మరియొక తరము జనుదెంచు సకల వంశము లిట్లు
సమసిపోవుచుండు నిఁక వారి పేర్పింపు లెచ్చోట నేమాయె నొకండైన
చెప్పుటకు నుర్విలో లేఁడు‖ విసుకదే ‖
Verse
ఏటివంకలు దీర్చ నెవ్వాని కలవి ము న్నీటి మూఁకుడు సేయ
నేర్పరి యెవండు మోటైన మనసు వం పులు దీర్చు గురు వెవఁడు కోటి
ధనమిచ్చినను కుంభినిని లేఁడు‖ విసుకదే ‖
Verse
ధరణిలో నరరూపు దాల్చి పాపుల కొఱకు మరణమై లేచు స ద్గురు
డైన యేసు చరణాబ్జముల సేవ సారమిది యొక్కటే పరమ ఫలమిడు
సుఖ ప్రాప్తి యొనరించున్‖ విసుకదే ‖

Related Tags

LifeVanityWisdom