Chorus
విశ్వాస వనితలం – యెహోవా నీడన నివాసులం
కన్నీటి ప్రార్ధనే మా బలం
ఆత్మ ఫలములే మా వరం
జయగీతం పాడెదం – విజయ కీర్తన పాడెదం
Verse
జ్ఞానము కలిగి జీవించెదం – యేసుని ప్రేమలో నిలిచెదం
విశ్వాసములో ఎదిగెదం – దేవుని సాక్షిగా బ్రతికెదం
Verse
శోధనలెన్నో కలిగిన – వాక్యపు వెలుగులో నడిచెదం
ఎర్ర సముద్రములెదురైన – దేవుని కృపతో దాటెదం
నీవే ఇల ఆధారం నీవే ఇల ఆనందం నీతోనే మా పయనం యేసయ్య
నీవే మా విశ్వాసం నీవే మా ఉత్సాహం నీతోనే మా విజయం యేసయ్య
Verse
దేవుని చిత్తమునే చేసెదం – యేసుని నామమే ప్రకటించెదం
సువార్త భారముతో సాగెదం – సర్వలోకానికి చాటెదం