Verse
విశ్వాస వనితలము - ప్రభు యేసు ముద్రికలం‖ 2x ‖
ప్రకటించెదం, ప్రార్ధించెదం, స్తుతియించెదం - ప్రభుకై నిలిచెదము
హోసన్నా మహిమ నీకే - యేసన్నా ఘనత నీకే‖ 2x ‖
Verse
సాటియైన సహాయముగా - మము సృస్టించాడు
మేటియైన ప్రభు కార్యముకై - మము నిలిపాడు
చురుకుదనం మా ప్రత్యేకత - ఆతిద్యమే మా నైజం
అమ్మగా, ఆలిగా, బలశాలిగా - మము దీవించాడు
హోసన్నా మహిమ నీకే - యేసన్నా ఘనత నీకే‖ 2x ‖
Verse
ప్రభుయేసు పునఃరుర్థానం - ప్రకటించింది మేమే‖ 2x ‖
అత్తరు తైలముతో - అభిశేకించింది మేమే
ప్రేమ గుణం, త్యాగ గుణం, సుగుణ సుగంధం - మాలో నింపాడు
జాలిగా, ప్రేమగా, మేలుగా - మము దీవించాడు
హోసన్నా మహిమ నీకే - యేసన్నా ఘనత నీకే‖ 2x ‖