Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vivaaham Ghanamainadhi

వివాహం ఘనమైనది

Vivaaham Ghanamainadhi

Lyricist: P Srinivas
Verse 1
వివాహం ఘనమైనది
ఆ దేవుడు ఏర్పరచినది
పరిణయం ప్రభు చేసినది
క్రీస్తు సంఘమునకు మాదిరిది
ఆదియందు దేవుడు ఆదామును చేసి
ప్రక్కటెముకతో హవ్వను స్త్రీగా నిర్మించి
ఇద్దరుగా ఉన్నవారు ఒక్కరేనని
ఒక్కరి నుంచే ఇద్దరు వచ్చారని
ఒంటరిగా ఉన్న పురుషుడికి
జంటగా చేరి సహాయం చేయాలని
ఫలించి అభివృద్ధి పొందాలని
విస్తరించి భూమిని నిండించాలని
దేవుడిచ్చు బహుమానమైన పిల్లలను
పరిశుద్దులుగా తనకే పెంచాలని
భర్త ప్రేమించి తనలో భాగమని
ఇతరులనాశింపక నమ్మకంతో ఉండాలని
భార్య లోబడి భర్తె శిరస్సని
దేవుని పనిలో సహకారినిగా ఉండాలని
జీవితకాలమంత ప్రభులో ఉండాలని
జీవన మార్గములో తనకై బ్రతకాలని
అకుల, ప్రిస్కిల్లలా పని చేస్తూ ఉండాలని
గుణవతి భార్యగా దొరుకుటరుదని
ముత్యంకన్న అమూల్యమైనదని
నిష్ఠూర పెట్టని భర్తగా ఉండాలని
సుఖదుక్కములయందు సంరక్షించాలని
మనుషులు వేరైనా ప్రేమయు ఒకటగా
కాళ్లు రెండైనా పయనమొకటిగుండాలని
చేతులు రెండైనా చేయుపని ఒకటిగా
కళ్లు రెండైనా చూపు ఒకటిగుండాలని
కలిమి లేమిలో జతగా ఉండాలని
వ్యాధారోగ్యములో కలిసి బ్రతకాలని
మరణం ఎడబాపు వరకు విడకూడదని

Related Tags

MarriageWeddingFamily