Verse
వ్యర్థం, వ్యర్థం, సర్వము వ్యర్థం - నశించు లోకం నాశము తధ్యం
Verse
దుష్టలోకములో సర్వము చెడెను
దీని యందంవాడి పోవుచున్నది - పోవుచున్నది‖ 2x ‖
Verse
చూడన్ మనసేలాగు నాశనమైపోయెన్
నిండియున్నదిపుడే పాపపుపాత్ర, పాపపుపాత్ర‖ 2x ‖
Verse
నలుదిశల చూడుమా పాపము కలదు
కలహ కలవరములో నిండియున్నది, నిండియున్నది‖ 2x ‖
Verse
లోకంలో నన్ని గతించి పోవునవి
లోకం యెంతో అయోగ్యంబైయున్నది, అయోగ్యంబదే‖ 2x ‖
Verse
యిద్ధరలో మనకేమియు లేదు
స్వార్థము, శతృత్వము, ఈర్ష్యమయము, ఈర్ష్యమయము‖ 2x ‖
Verse
ఒకనాడీ మహిని ప్రభువు దహించును
సకలంబును నాశనంబుచేయును, నాశనముచేయును‖ 2x ‖
Verse
ఒక రాజ్యము వచ్చునందు దీవెన కలదు
సకల శాంతి సంతోషమందు కలదు, అందునగలదు‖ 2x ‖
Verse
ఆ రాజ్యంలో నీవు ప్రవేశించుటకు
మారు మనసునొంది యేసుని నమ్ము, యేసుని నమ్ము‖ 2x ‖