Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vyarthamu Vyartham Sarvamu

వ్యర్థము వ్యర్థం సర్వము

Vyarthamu Vyartham Sarvamu

Verse
వ్యర్థము, వ్యర్థం, సర్వము వ్యర్థం
నశించు లోకం నాశము తధ్యం
Verse
దుష్టలోకములో సర్వము చెడెను
దీని యందంవాడి పోవుచున్నది - పోవుచున్నది‖ వ్యర్థం ‖
Verse
చూడన్ మనసేలాగు నాశనమైపోయెన్
నిండియున్నదిపుడే పాపపుపాత్ర, పాపపుపాత్ర‖ వ్యర్థం ‖
Verse
నలుదిశల చూడుమా పాపము కలదు
కలహ కలవరముతో నిండియున్నది, నిండియున్నది‖ వ్యర్థం ‖
Verse
లోకంలో నన్ని గతించి పోవునవి
లోకం యెంతో అయోగ్యంబైయున్నది, అయోగ్యంబదే‖ వ్యర్థం ‖
Verse
యిద్ధరలో మనకేమియు లేదు
స్వార్థము, శతృత్వము, ఈర్ష్యమయము, ఈర్ష్యమయము‖ వ్యర్థం ‖
Verse
ఒకనాడీ మహిని ప్రభువు దహించును
సకలంబును నాశనంబుచేయును, నాశనముచేయును‖ వ్యర్థం ‖
Verse
ఒక రాజ్యము వచ్చునందు దీవెన కలదు
సకల శాంతి సంతోషమందు కలదు, అందునగలదు‖ వ్యర్థం ‖
Verse
ఆ రాజ్యంలో నీవు ప్రవేశించుటకు
మారు మనస్సునొంది యేసుని నమ్ము, యేసుని నమ్ము‖ వ్యర్థం ‖

Related Tags

RepentanceVanityJudgment