Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vyasanapadakumu Neevu Cheddavaralanu Juchinayapudu

వ్యసనపడకుము నీవు చెడ్డవారలను జూచినయపుడు

Vyasanapadakumu Neevu Cheddavaralanu Juchinayapudu

Chorus
వ్యసనపడకుము నీవు - చెడ్డవారలను జూచినయపుడు
మత్సరపడకుము నీవు - దుష్కార్యములు చేయువారిని జూచి
Verse
వారు గడ్డివలె త్వరగా - ఎండిపోదురు
పచ్చని కూరవలె వారు - వాడిపోవుదురు - ఆ ... నీవు‖ నీవు ‖
Verse
యెహోవా యందు నమ్మికయుంచి - మేలు చేయుము
దేశమందు నివసించి సత్యము - ననుసరించుము - ఆ ... నీవు‖ నీవు ‖
Verse
నీదు మార్గము యెహోవాకు అప్పగింపుము
ఆయనను నమ్ముకొనుము నీదు - కార్యము నెరవేర్చును ... నీవు‖ నీవు ‖
Verse
కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము
వ్యసనపడకుము నీ కది - కీడు కే కారణము ... నీవు‖ నీవు ‖
Verse
ఒకని నడత యెహోవాయే - స్థిరము చేయును
ఆయన వాని ప్రవర్తనను జూచి - ఆనందించును - ఆ ... నీవు‖ నీవు ‖
Verse
యెహోవా అతని చేతిని - పట్టి యుండెను
అతడు నేలను పడినను లేవ - లేక యుండడు - ఆ ... నీవు‖ నీవు ‖
Verse
నీతిమంతులు విడువబడుటగాని - వారి సంతానము
భిక్షమెత్తుటగాని - నేను చూచి యుండలేదు - ఆ ... నీవు‖ నీవు ‖

Related Tags

EncouragementPsalmGodTrust