Chorus
వ్యోమ సింహాసనస్థుఁడ యుర్వి పాదపీఠస్థుఁడ మామకీన దయా
మయుఁడ మమ్ముఁగావుమో దేవుఁడ‖ వ్యోమ ‖
Verse
అంతరిక్ష లోకదీప యద్భుతాదృశ్య స్వరూపా యింత నీ మహిమనోప
నెంతది నా నాల్క చూప‖ వ్యోమ ‖
Verse
గాలి ఱెక్కల పైనెక్కి గాఢాంధకారమునందు నేలికవై సంచరించు
నట్టి నిన్ను మ్రొక్కుచుందు‖ వ్యోమ ‖
Verse
నీతి న్యాయ దీర్ఘశాంతా నిర్మల దయా నితాంతా
ప్రీతినుంచవే శ్రీమంతా పెద్దఁగా నా కాలమంతా‖ వ్యోమ ‖
Verse
సర్వ భూలోక పూజితా సత్య సద్గుణ రాజితా గర్వ దుస్స్వభా
వాహితా కావునాన్ని నాట పితా‖ వ్యోమ ‖
Verse
నమ్మిన యీనన్నఁ తూల నాడవు దీనాత్మపాలా
క్రమ్మి నీ ప్రేమతోఁ జాల బ్రోతువు దయాలా వాలా‖ వ్యోమ ‖