Verse
యాజక ధర్మము నెరిగి - యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు
Verse
ఆది ప్రధాన యాజకు డహరోను ప్రభునికే ముంగురుతు
అతని కుమారులు విశ్వాసులకు ప్రాపుగ ముంగురుతు
Verse
ప్రధాన యాజకుడు మనయేసే - యాజకులము మనమే
పరమ పిలుపులో నిలిచినవారే స్థిరముగ నుండెదరు
Verse
నాదాబు యనగా మనసున్నవాడని - అబీహువు నా తండ్రి
ఎలియేజరనగ దేవుడు నా బలము ఈతామారు ఖర్జూర భూమి
Verse
అహరోను ధరించిన వస్త్రములేడు - వాని యర్ధమేమి?
ప్రభుయేసు వాని యందున్న వాడు రక్షింపబడిన వారును
Verse
పతకము, ఏఫోదు, విచిత్రమైన దట్టీ - నిలువుటంగీ, పాగ
మేలిమి బంగరు రేకు, విచిత్ర - మైన చొక్కా ఏడును
Verse
ఆయనతోడ వేయి వత్సరములు ఆనందముతో నేలుచు
యాజకులందరు భాగ్యశాలులై హల్లెలూయ పాడెదరు