Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yaakobu Baavi Kaada Yesayyanu Choosaanammaa

యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా

Yaakobu Baavi Kaada Yesayyanu Choosaanammaa

Verse
యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా
ఎండా వేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా‖ 2x ‖
దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా‖ 2x ‖
నేనిచ్చుఁ నీళ్లు నీకు ఎన్నడు దప్పిక కావన్నాడే‖ 2x యాకోబు ‖
Verse
అయ్యా నే సమరయ స్త్రీని – మీరేమో యూదులాయె
మీకు మాకు ఏనాడైనా – సాంగత్యము లేకపాయె‖ 2x ‖
నేనిచ్చుఁ నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా‖ 2x ‖
చేదుటకు ఏమి లేదు నాకెట్లు ఇస్తావయ్యా‖ 2x యాకోబు ‖
Verse
అయినా నీళ్లు నాకు ఇమ్మని నేనడిగానే
నీళ్లు నీకు ఇస్తాగాని నీ భర్తను రమ్మన్నాడే‖ 2x ‖
అయ్యా నే ఒంటరిదాన్ని నాకెవ్వరు లేరన్నానే‖ 2x ‖
లొపేమి ఎరగనట్టు లోగుట్టు దాచినానే‖ 2x యాకోబు ‖
Verse
నీకు భర్త లేడన్నాడే పెనిమిట్లు ఐదుగురుండే
ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాదన్నాడే‖ 2x ‖
వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా‖ 2x ‖
ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా‖ 2x యాకోబు ‖
Verse
నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు
ఏ తట్టు చూస్తున్నావో లోగుట్టు దాస్తున్నావో‖ 2x ‖
గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా‖ 2x ‖
తప్పకుండ యేసు ముందు తల వంచి మొక్కాలమ్మా‖ 2x యాకోబు ‖

Related Tags

TestimonyJesus