Chorus
యే సొసంగె గొప్ప యాజ్ఞను తన శిష్యులకును యేసొసంగె గొప్ప
యాజ్ఞను దాసులునుగఁ జేయ బోయి ధరణిమీఁది రాష్ట్రములకు ఆ
సను బాప్తిస్మ మిచ్చి నా సుబోధ నేర్పుఁడనుచు‖ యేసొసంగె ‖
Verse
జనక కుమారాత్మల పేర బాప్తిస్మ మియ్యఁ చనుడు మీరు సకల
దిశలను తనయు లైనఁ తల్లులైనఁ తండ్రులైనఁ బొందవచ్చుఁ దగిన
రీతి దాని నిపుడు తండ్రియైన దైవ కృపను‖ యేసొసంగె ‖
Verse
బాలు రెల్ల బొందవచ్చును బాప్తిస్మ మిపుడు జాలిఁ జూపు క్రీస్తు సెలవున
బాలు రందుఁ బ్రేమ నుంచి ప్రభువు పిలుచు వారి నెల్లఁ జాల మేలు
సేయ గోరి సకల కాలముల యందు‖ యేసొసంగె ‖
Verse
పొందవలయు బాప్తిస్మము శుద్ధాత్మ చేత విందుఁ గలుగు మనుజు
లందరు మంద బుద్ధి విడిచి పెట్టి మహిమ గల్గు దేవు గొల్వ నందము
గను లేచి రండి హర్ష పూర్ణు లగుచు మీరు‖ యేసొసంగె ‖