Chorus
యమ్మాయి దారులలో, కృంగిన వేళలలో
నా యేసు నడిచెనుగా నా కన్నులు తెరిచెనుగా
యేసే అజేయుడు నా యేసే సజీవుడు హల్లెలూయ
యేసే ఆరాధ్యుడు నా యేసే ప్రాణ ప్రియుడు
Verse
ఆ కోరు లోయలలోన గాడాందకారములోన
నడచెను ఒంటరిగాను - నా యేసు నాలో వుండును
చల్లని నీడలలోన జలదారు తావులలోన
నా యేసుపై ఆనుకోని నే సాగిపోయెదను‖ యేసే ‖
Verse
శోధన వేదనలోన గాలి తుఫానులలోన
నా యేసు నా నావలోన నిదురించిన చాలును
సాగర కెరటాలైన సాతాను పోరాటమైన
నా యేసుని ఆనుకొని హాయిగ పయనించెదను‖ యేసే ‖
Verse
గుడార యానములోన నా జీవిత యాత్రలోన
ఆరణ్యదారులలోన నా జీవితా నావలోన
ఇరులే తరులే ఒరిగిన పర్వతాలుయె తొలిగిన
ఆభయ మిచ్చిన వాడు మారడు నా యేసుడు‖ యేసే ‖