Chorus
యౌవనుడా సంతోషపడుమా - యౌవన కాలమున
Pre-Chorus
అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చును నిన్ను - జ్ఞప్తినుంచుకో
Verse
లేత వయస్సు నడి ప్రాయమును - గతించిపోవునవి
గనుక నీదు హృదయములో - వ్యాకులమును
తొలగించుకొనుము - యువకుడా వినుము
Verse
దుర్దినములు రాబోకముందే - వీటి యందిపుడు
సంతోషము లేదనియెడు సంవత్సరములు
రాబోకముందే - చెడుగును విడుమా
Verse
పశ్చాత్తాపమున పాపములను - ఒప్పుకొనుచు నేడే
రక్షణార్థము - రక్షకుడేసును
రయమున క్షమాపణ వేడిన - రక్షణ నీదే
Verse
మన్నయినది వెనుకటివలెనే - మంటిలో కలియున్
ఆత్మ దాని దయ చేసిన
దేవుని సన్నిధికి మరల - వెళ్ళును యౌవనుడా