Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yauvanulaaraa Mee Yauvanamuloa Santasinchudi

యౌవనులారా మీ యౌవనములో సంతసించుడి

Yauvanulaaraa Mee Yauvanamuloa Santasinchudi

Chorus
యౌవనులారా! మీ యౌవనములో సంతసించుడి
అయితే మీ పనులను బట్టి మీకు - తీర్పు కలుగును
Verse
కీడుకై పరిగెత్తెడు మీ పాదములను
క్రీస్తే సనెడు బండపై నిలిపియుంచి
సిద్ధ మనస్సనెడు జోడు మీరు తొడుగుకొని
రక్షణ సమాచారమును ప్రచురించుడి
Verse
అపవిత్రతతో నిండిన మీ హస్తములను
ఆ యేసయ్య రక్తములో కడుగుకొని
పవిత్రమైన చేతులను ప్రభువైపు చాపి
పరిశుద్ధాలయమునందు ప్రార్థించుడి
Verse
నరకమున బడద్రోయ గలిగిన మీదు
నాలుకలను భద్రముగా చేసికొనుచూ
స్తుతియించుడి కీర్తించుడి ప్రభుయేసుని
అతిప్రియమున మీ నాలుకలతో ఎల్లప్పుడు
Verse
అభ్యంతర పరచెడు మీ నేత్రములను
ఆశ్రయ దుర్గముపై స్థిరపరచి
మహిమాత్మతో రక్షణకర్తయగు క్రీస్తుని
మహిమను చూచుటకు ఉపయోగించుడి
Verse
హితబీధను సహింపని మీ దురద చెవులను
కల్పన కథల వైపునకు త్రిప్పకుండ
చల్లని మెల్లని ప్రభుయేసు స్వరమును
సత్యము వినుటకు మీ చెవులనియ్యుడి

Related Tags

YouthWisdom