Chorus
ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు నేసువా
ఏ దిక్కు లేని నన్ను ప్రేమించి నావయా
ఎంతో కృపను చూపి దీవించి నావయా
ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు నేసువా
Verse
పాపాల సంద్రమందున పయనించు వేళలో
పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయా‖ ఏ రీతి ‖
Verse
నా పాప శిక్ష సిలువపై భరియించి నావయా
నా దోషముల సహించి క్షమియించి నావయా‖ ఏ రీతి ‖