Verse
ఏ రీతిగా నిన్ను స్తుతియింతును
ఏ రీతిగా నిన్ను ఘనపరతును
ఏ రీతిగా నిన్ను కీర్తింతును
ఏ రీతిగా నిన్ను కొనియాడెదన్
Chorus
ఒక తరమైన చాలదు నీ కోసము
ఒక యుగమైన చాలదు నీ కోసము
Verse 3
ఆ……ఆ……..ఆ……ఆ…..
Verse
ఒక క్షణమైన దూరమైతే ప్రాణమాగదే
ఒక అడుగైన విడచివెళ్ళితే ఊపిరాడదే
నీవులేని ఈ లోకం నాకెందుకు
నడిపించు నన్ను నీ పొందుకు
Verse
నా కన్నుల్లో నీ రూపమే
నా గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశలలో నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే…….
నీ తోడే లేని నా బ్రతుకుకు నాతోడై ఉండు కడవరకు
Chorus
ఒక తరమైన చాలదు నీ కోసము
ఒక యుగమైన చాలదు నీ కోసము
Verse
ఏ రీతిగా నిన్ను స్తుతియింతును
ఏ రీతిగా నిన్ను ఘనపరతును
ఏ రీతిగా నిన్ను కీర్తింతును
ఏ రీతిగా నిన్ను కొనియాడెదన్ …. యేసయ్యా