Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ye roopamu leni nannu pindamunai ne unna

యే రూపము లేని నన్ను పిండమునై నే ఉన్నా

Ye roopamu leni nannu pindamunai ne unna

Lyricist: Uday Kanthi Shanmukha
Verse
యే రూపము లేని నన్ను, పిండమునై నే ఉన్నా
నా అంతరంగమును చెక్కిన, శిల్పివి నీవే
బందీనై ఉన్నా, నాకు తోడు గా నీవు నిలచి
నీ మార్గము నాకు చూపించి, నన్ను నడిపించితివే
Chorus
యెంత అద్భుతమో నీ కార్యములు
మనోహరమో నీ తలంపులు
Verse
చీకటి లో ఉన్న, నా జీవితానికి
విమోచన నీవైతివే….
నీ బాహువు చాపి, నను ఆదరించి,
నీ సొత్తు గా నను మార్చినావు…
Verse
నీ కనుద్రుష్టితో కరుణించి నావు
నీ గ్రంధములో లిఖించితివే….
నీదు ప్రేమను నా పై చూపించి
నీదు కృపతో కాచినావు……
Verse
నీ సేవకై నా హృదయమును
అర్పించుకొందునయ….
నీ సాక్షిగనై నే నీ కాడి మోసి,
నీ జీవ మార్గము ప్రకటించెద

Related Tags

GraceDevotionCreation