Chorus
ఏ స్థితిలోనైనా నిన్ను ప్రేమించేవానిగా
ఏ స్థితిలోనైనా నీకు మొరపెట్టెవానిగా
చేయుము నా దేవా, చేయుము నా దేవా‖ 2x ‖
Chorus
అది మరణమైనను జీవమైనను శ్రమయైనను...
అది బాధయైనను వేదనైనను కరువైనను...
Verse
నా తల్లే నన్ను మరిచిపోయినా, నా తండ్రే నన్ను విడచివెళ్లిన
నా స్నేహితులే నన్ను త్రొసేసిన, నే ప్రేమించేవారికి దూరమైనా‖ 2x ‖
విడువవు ఎడబాయవని సెలవిచ్చిన యేసయ్య
తల్లి మరచినా మరచును,నన్ను మరువని యేసయ్య‖ 2x ‖
Verse
నా సొంతవారినే నే కోల్పోయిన,నా ఆరోగ్యం నన్ను వదిలివెళ్లిన
నాకున్న ఆశే నెరవేరకపోయిన,నా హృదయంలో కలవరమే ఉన్నాను‖ 2x ‖
దేనికి భయపడక నే ముందుకే సాగేదా...
నీ మాట తప్పక నెరవేరునని నమ్మెద...‖ 2x ‖
విడువవు ఎడబాయవని సెలవిచ్చిన యేసయ్యా
తల్లి మరచినా మరచును,నన్ను మరువని యేసయ్యా‖ 2x ‖
నన్ను మరువని యేసయ్యా
నన్ను మరువని ...................యేసయ్యా