Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yedategaka Prarthinchumu Melakuvatho Konasagumu

యెడతెగక ప్రార్థించుము మెలకువతో కొనసాగుము

Yedategaka Prarthinchumu Melakuvatho Konasagumu

Verse
యెడతెగక ప్రార్థించుము - మెలకువతో కొనసాగుము
Verse
క్రీస్తుని ఉపదేశమును పొంది - ఆయన మాదిరి మదియందుంచి
ప్రార్థించుము - కౄతజ్ఞతతో - ఆనంద గీతము పాడుచును
Verse
ఆయన రాకడ సమీపము - అర్థరాత్రో కూడి కూయునపుడో
గమనిక లేనివానివలె నుండిన - యజమానుని శిక్షకు గురి యగుదువు
Verse
ఉగ్రత నుండి తప్పించు యేసు - ప్రత్యక్షమౌను పరమందుండి
ఉపద్రవమందు పొందిన రక్షణ కాపాడుకొనన్ నీ ఆత్మయందు
Verse
మీరేగదా మాదు నిరీక్షణ - ఆనందమును అతిశయమని
ప్రేమతో ప్రయాస మొందునట్టి - దైవజనుల పోలి నడువంగను
Verse
విశ్వాసమందున్న లోపములను - సరిదిద్దుటకు కృపను పొంద
ప్రార్థించు సేవకుల ప్రేమను చూచి - వేదనతో వేడు శక్తిని పొంద
Verse
ప్రధానదూత శబ్దమును - దేవుని బూర ద్వనిని వినగా
క్రీస్తునందుండి మృతులైనవారు - లేతురు మొదట మనకన్న ముందు
Verse
నిద్రపోక భద్రముగా నుండ - భారముతో వేడుము ప్రభు శక్తిని
ఎత్తబడరు మత్తులైనవారు - మెలకువతో వేడు ఉజ్జీవాత్మకై
Verse
మీ ఆత్మజీవమును రాకడయందు - నిందారహిత సంపూర్ణతతో
సమాధాన కర్తన్ ప్రార్థించుము - కాపాడబడను పరిశుద్ధతలో

Related Tags

PrayerChristian LifeWatchfulness