Verse
పల్లవి: యెహావా నా బలమా - యధార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం
Verse
నా శత్రువులు నను చుట్టినను
నరకపు పాశములరికట్టినను
వరదవలె భక్తిహీనులు పొర్లిన
విడువక నను యెడబాయని దేవా
Verse
మరణపుటురులలో మరువక మొరలిడ
ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై
తన ఆలయములో నా మొర వినెను
అదిరెను ధరణి భయకంపముచే
Verse
పౌరుషముగల ప్రభు కోపింపగా
పర్వతముల పునాదులు వణికెను
తననోటనుండి వచ్చిన యగ్ని
దహించి వేసెను వైరులనెల్ల
Verse
మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును
ఉరుముల మెరుపుల మెండుగ జేసి
అపజయ మిచ్చును అపవాదికిని
Verse
దయగల వారిపై దయ చూపించును
కఠినుల యెడల వికటము జూపును
గర్విష్టుల యొక్క గర్వము నణచును
సర్వము నెరిగిన సర్వాధికారి
Verse
నా దీపమును వెలిగించు వాడు
నా చీకటిని వెలుగుగా జేయును
జలరాసుల నుండి బలమైన చేతితో
వెలుపల జేర్చిన బలమైన దేవుడు
Verse
నా కాళ్ళను లేడి కాళ్ళగా జేసి
ఎత్తయిన స్థలముల శక్తితో నిలిపి
రక్షణ కేడెము నా కందించి
అక్షయముగ తన పక్షము జేర్చిన
Verse
యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడ వీవు
అన్యజనులలో ధన్యత జూపుచు
హల్లెలూయ స్తుతిగానము జేసెద