Verse
యెహోవాయె మనకందరికి - ఎన్నియో మేలుల జేసెన్
తన కృప కనికరముల్ - స్మరియించి స్తుతించెదము
Verse
మనమాయన జనము - ఆయన సంతతియు
సిలువ మరణముద్వారా మనకు - తనదు జీవమునిచ్చె
ఎంత అద్భుత రక్షకుడు
Verse
అడుగువాటికంటె - అధికముగ నిచ్చె
తన నిబంధనను స్థిరపరచి - తన వాక్కులు నెరవేర్చె
మాట తప్పనివాడవు
Verse
కష్టదుఃఖములందు - పాలివాడాయె
ప్రేమనుజూపి ప్రభువే మనల - తన రెక్కలపైమోపె
మనతో నుండును నిరతము
Verse
ఎన్నిసార్లు ప్రభుని - దుఃఖపరచితిమి
అయినను ప్రభువే తన దయజూపి
మనలన్ క్షమియించెనుగా - ప్రేమగల మా తండ్రివి
Verse
నీవే మా దుర్గమును - కేడెము నీవే
నిన్నుమేము నమ్మియున్నాము - మాకు సర్వము నీవే
మేము నీదు ప్రజలము