Chorus
యెహోవయే నా మహాదేవుఁడని బహుగ నెఱిఁగి మన నావంతు
సహదాసులతో మహి నొకఁడనని సహాయ మిడుటే నీవంతు‖ యెహోవా ‖
Verse
మితిమిఱిన దు రిత సమూహముల క్షత మొనర్ప మన నావంతు
పతితపావనుని క్షతజనములో నను నుతికి కడుగుటె నీవంతు‖ యెహోవా ‖
Verse
ప్రతిదిన బ్రతుకును మతి నుంచుచు నిను స్తుతి యొనర్చుటే నావంతు
క్షితినేఁబడుదు ర్వెతల నుండ శా శ్వతముఁ బ్రోచుటె నీవంతు‖ యెహోవా ‖
Verse
చంచల మతిఁదొల గించుమంచుఁ బ్రా ర్థించుచుండుటే నావంతు
అంచి తాత్మనిఁకఁ బంచి స్ధిరతను బెంచుచుండుటే నీవంతు‖ యెహోవా ‖
Verse
యేసు సిలువలో నే సంధించి గాసి సహించుట నావంతు భాసురమోక్ష
ని వాసమునకు నను దీసుకపోవుటే నీవంతు‖ యెహోవా ‖
Verse
మేటి వార్త నా బోటి జనాళికి ఁ జాటించుటయే నావంతు చాటిన
దానిని గాటముగ మది నాటించుటయే నీవంతు‖ యెహోవా ‖
Verse
అనుదిన మబలుఁడ నని మదినిం గనుఁ గొని బ్రదుకుటయే నా
వంతు ననుఁ బదాబ్జప జ్జనుఁ జేర్చియు బల మును గృప నిచ్చుటే
నీవంతు‖ యెహోవా ‖
Verse
ముదముతోడ నీ తుదిరాక కొఱకు నెదురు చూచుటే నావంతు
సదమలాత్మచే హృదయమును సదా పదిలపఱచునటే నీవంతు‖ యెహోవా ‖