Verse
యెహోవా అగాధ స్థలములలో నుండి - నీకు మొర పెట్టుచున్నాను
ప్రభువా నా ప్రార్థనకు చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము
Verse
యెహోవా నీవు దోషములు - కనిపెట్టి చూచిన యెడల
ప్రభువా ఎవడు నిలువగలడు?
Verse
అయినను జనులు నీ యందు - భయభక్తులు నిలుపునట్లు
నీ యొద్ద కృప దొరుకును
Verse
యెహోవా కొరకు నేను - కనిపెట్టుకొనుచున్నాను
ఆశ పెట్టుకొనుచున్నాను
Verse
కావలి వారు ఉదయము కొరకు - కనిపెట్టుకొనుట కంటె
నా ప్రాణము కనిపెట్టుచున్నది
Verse
ఇశ్రాయేలు యెహోవా - మీద ఆశపెట్టుకో
యెహోవా యొద్ద కృప దొరుకున్
Verse
ఇశ్రాయేలు దోషము నుండి - ఆయనే విమోచించును
విమోచన దొరుకును