Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Andariki Mahopakaruundu

యెహోవా అందరికి మహోపకారుండు

Yehova Andariki Mahopakaruundu

Verse
యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడు
దీర్ఘశాంతము కృపాతిశయము కలిగినవాడు
Chorus
యెహోవా అందరికిని మహోపకారుండు
ఆయన కనికరమాయన పనులపై నున్నది
Verse
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ క్రియలు
నీ భక్తులందరు నిన్ను స్తుతించెదరు గాక
Verse
నీ భక్తులు నీ ప్రభావమును మానవులకు దెల్పెదరు
నీ శౌర్యమునుగూర్చి నీ భక్తులు పల్కెదరు
Verse
నీ రాజ్యము శాశ్వత రాజ్యమని తెల్పెదరు
నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును
Verse
యెహోవా పడినవారినెల్ల నుద్ధరించును
కృంగిపోయిన వారినెల్లర లేవనెత్తును
Verse
సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి
తగినట్టి వేళ నీవు వారికి ఆహారమిత్తువు
Verse
యెహోవా దేవా నీ గుప్పిలిని నిత్యము విప్పి
ప్రతి జీవి కోరిక నెల్లను తృప్తిపరచుచున్నావు

Related Tags

PraiseThanksgivingPsalm