Verse
యెహోవ గద్దె ముందట
జనంబులార మ్రొక్కుఁడి
యెహోవ దేవుఁడే సుమీ
సృజింపఁ జంపఁ గర్తయే
Verse
స్వశక్తిచేత నాయనే
మమున్ సృజించె మట్టిచే
భ్రమించు గొఱ్ఱె రీతిగాఁ
దప్పంగ మళ్లీ చేర్చెను
Verse
సుకీర్తి పాడి గుంపులై
ప్రసిద్ధిచేతు మాయనన్
జగత్తు వేయి నోళ్లతో
స్తుతించు దివ్యమౌ ధ్వనిన్
Verse
ప్రభుత్వ ముండు నంతకున్
అగున్ నీ ప్రేమ నిత్యము
చిరంబు నీదు సత్యము
వసించు నెల్లకాలము