Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Goppa Karyamulu Chesenu Veerikoraku

యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరికొరకు

Yehova Goppa Karyamulu Chesenu Veerikoraku

Verse 1
Reference: యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు. మనము సంతోషభరితులమైతివిు. కీర్తన Psalm 126:3
Chorus
యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరికొరకు
ఇహమున అన్యజనము లెల్ల చెప్పుకొనుచున్నారటుల
Verse
యెహోవా మనకొరకు - గొప్ప కార్యములు చేసెను
మహా సంతోషభరితులమైతివిు - సహపనివారినిగా జేసెన్
Verse
ప్రారంభ కాలపనులను - పరిహసించువారెవరు
ప్రభు పనిచేయ పదివేలగు నొకడు - విరవిగ బలమౌ జనమగును
Verse
ప్రభు సువార్తకై బహుగా మేము - బాధించబడి యుంటిము
ప్రబలెను ప్రభుని వాక్యము - ప్రబలితిమి మేము ప్రభు కృపలో
Verse
పొరపాటులెన్నో చేసితిమి - ప్రభుకృపతో మమ్ము క్షమించెన్
విరోధ మంత్ర శకునము లేమి - ఇశ్రాయేలులో నికలేవు
Verse
భూమిపై గడ్డిని తడుపు - వానవలె విజయము నిచ్చెను
సమ భూమిని బోలి సముద్రములో - క్షేమముగా మము నడిపెను
Verse
అధికంబాయె మా అంత్యదశ - మొదటి పనులను మించెన్
మొదటి మందిర మహిమను మించె - తుది మందిరపు మహిమ
Verse
మహిమ ఘనతా ప్రభావములు - మా కృతజ్ఞతా స్తోత్రములు
సింహాసనాసీనుండా మాదు - సీయోను రాజా హల్లెలూయ

Related Tags

PraiseThanksgiving