Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Illu Kattinchani Yedala

యెహోవా ఇల్లు కట్టించని యెడల

Yehova Illu Kattinchani Yedala

Chorus
యెహోవా ఇల్లు కట్టించని యెడల
దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే
యెహోవా పట్టణమును కాపాడనియెడల
దాని కాయువారు మేల్కొనినను వ్యర్థమే
Verse
మీరు వేకువనే లేచి రాత్రియైన
తర్వాత పండు కొనుచు మీరు - తర్వాత‖ తర్వాత ‖
ఆర్జితమైన ఆహారమును
మీరు తినుచుండుట వ్యర్థమే - మీరు‖ మీరు ‖
Verse
తన ప్రియులు నిద్రించుచుండగా
తానే యిచ్చు చున్నాడు వారికి - తానే‖ తానే ‖
తనయులు దేవుడిచ్చు స్వాస్థ్యము
కనెడి గర్భఫలము బహుమానమే - కనెడి‖ కనెడి ‖
Verse
యౌవన కాలమున పుట్టిన కుమారులు
బలవంతుని చేతిలోని బాణములు - బలవంతుని‖ బలవంతుని ‖
తన అంబుల పొదిని నింపుకొనువాడు
ధన్యుడు అట్టివాడు బహుగా ధన్యుడు
Verse
యెహోవా యందు భయభక్తులు కలిగి
నడచు వారందరు ధన్యులు - నడచు‖ నడచు ‖
మహా మేలు నీకు కలుగును
నిశ్చయముగా నీవు ధన్యుడవు
Verse
నీవు ధన్యుడవు లోగిట నీ భార్య
ఫలించు ద్రాక్షావల్లి వలె నుండు - ఫలించు‖ ఫలించు ‖
భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు
ఒలీవ మొక్కల వలె నుందురు
Verse
యెహోవా యందు భయభక్తి గలవాడు
ఆశీర్వదింపబడును నిజముగా - ఆశీర్వ‖ ఆశీర్వ ‖
యెహోవా నిన్ను సీయోను నుండి
ఆశీర్వదించును బహుగా
Verse
నీ జీవితమంతా యెరూషలేముకు
క్షేమము కలుగుటయే జూతువు - క్షేమము‖ క్షేమము ‖
నీ పిల్లల పిల్లలను చూతువు నీవు
ఇశ్రాయేలు మీద నిత్యము సమాధానముండును

Related Tags

PsalmBlessingFamilyGods Grace